కరకరలాడే రవ్వ దోస రెసిపీ | Crispy Instant Rava Dosa Recipe in Telugu

 కరకరలాడే రవ్వ దోస | ఇన్‌స్టంట్ రవ్వ దోస రెసిపీ

పరిచయం

ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం టిఫిన్‌కు త్వరగా తయారయ్యే వంటల్లో రవ్వ దోస ఒకటి. బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, కొద్దిగా శనగపిండి, పంచదార కలిపి చేసిన ఈ దోస బయట కరకరలాడుతూ, లోపల తేలికగా ఉంటుంది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.


కరకరలాడే రవ్వ దోస రెసిపీ


Prep time ⏰ 10 Minutes
Rest Time ⏰ 20 Minutes
Cook Time 👩‍🍳 20 Minutes
Total Time 50 Minutes
Servings 4 మంది
Cuisine South Indian

కావలసిన పదార్థాలు

  • బొంబాయి రవ్వ (సన్న రవ్వ) లేదా ఉప్మా రవ్వ – 1 కప్పు
  • బియ్యప్పిండి – 1 కప్పు
  • మైదా పిండి -1/2 కప్పు 
  • శనగపిండి (బేసన్) – 1 టేబుల్ స్పూన్ 
  • పంచదార – 1 టీ స్పూన్
  • జీలకర్ర – 1 టీ స్పూన్
  • అల్లం సన్నగా తరిగింది – 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి సన్నగా తరిగింది – 2
  • కరివేపాకు సన్నగా తరిగింది – 1 రెమ్మ
  • కొత్తిమీర తరిగింది – 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు – తగినంత
  • క్యారెట్- 1
  • నీరు – పలుచటి పిండికి సరిపడా
  • నూనె – దోశ వేయించడానికి

కరకరలాడే రవ్వ దోస రెసిపీకి కావాల్సిన పదార్ధాలు


తయారీ విధానం

  1. ఒక పెద్ద గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి,శనగపిండి,మైదాపిండి పంచదార, ఉప్పు వేసి బాగా కలపండి.
  2. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపండి.
  3. కొద్దికొద్దిగా నీరు పోస్తూ పలుచగా, మజ్జిగలాగా ఉండే పిండిని తయారు చేయండి.
  4. ఈ పిండిని 20–30 నిమిషాలు నాననివ్వండి.
  5. దోశ పెనం బాగా వేడి అయ్యాక కొద్దిగా నూనె రాసి, పిండిని ప్రతి సారి కలుపుతూ పై నుంచి చల్లి దోశ వేయండి.
  6. అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి మధ్య మంటపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.
  7. ఒక వైపు బాగా కాలిన తర్వాత మడిచి వేడివేడిగా వడ్డించండి.
  8. సాదా దోశ తీసాక మరొకసారి దోశ పిండి కలిపి పెనం పై పోసుకుని  క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ దోశ పై వేసుకుని దోశ ఎర్రగా కాల్చుకోవాలి. అంతే రవ్వ దోసను పల్లి చట్నీతో వడ్డీంచడమే.
రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం

రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం

రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం

రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం

రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం
రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం
రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం
రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం
రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం
రవ్వ దోస పిండి కలుపుతున్న విధానం
పెనంపై రవ్వ దోస పిండిని పోస్తున్నవిధానం

చిట్కాలు

  1. కరకరలాడే దోశ కోసం పిండి తప్పనిసరిగా పలుచగా ఉండాలి.
  2. ప్రతి దోశ వేసే ముందు పిండిని బాగా కలపాలి. రవ్వ కిందకు చేరుతుంది.
  3. పంచదార కొద్దిగా వేయడం వల్ల దోశకు అందమైన బంగారు రంగు వస్తుంది.
  4. శనగపిండి కలపడం వల్ల దోశ మరింత కరకరలాడుతుంది.
FAQ

1. రవ్వ దోశ కరకరలాడాలంటే ఏమి చేయాలి?
A.పిండి పలుచగా ఉండాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. కొద్దిగా పంచదార, శనగపిండి కలిపితే మరింత కరకరలాడుతుంది.
2. రవ్వ దోశకు ఏ రవ్వ ఉపయోగించాలి?
A.బొంబాయి రవ్వ (సన్న రవ్వ) ఉత్తమం.
3. పిండిని ఎంతసేపు నానబెట్టాలి?
A.20–30 నిమిషాలు నానబెడితే రవ్వ బాగా మెత్తబడుతుంది.ఇంకా ఎక్కువగా నానబెట్టిన బాగానే వస్తాయి.
4. రవ్వ దోశ ఎందుకు పెనానికి అంటుతుంది?
A.పెనం సరైన వేడి లేకపోతే లేదా పిండి చిక్కగా ఉంటే అంటుతుంది.
5. రవ్వ దోశకు ఏ చట్నీ బాగా సరిపోతుంది?
A.కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ లేదా సాంబార్‌తో చాలా రుచిగా ఉంటుంది.

పెనంపై ఇన్‌స్టంట్ రవ్వ దోస వేస్తున్న చిత్రం
ఉల్లిపాయ క్యారెట్ రవ్వ దోస తయారీ

ముగింపు

ఈ సులభమైన ఇన్‌స్టంట్ రవ్వ దోస రెసిపీతో ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో కరకరలాడే దోసలను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, మైదా, శనగపిండి, మైదాపిండి కొద్దిగా పంచదార కలయిక వల్ల దోశకు మంచి రంగు, రుచి, కరకరలాడే టెక్స్చర్ వస్తాయి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. మీ కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా నచ్చుతుంది.

చట్నీ, సాంబార్‌తో కరకరలాడే రవ్వ దోస


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆలూ ఫ్రై ( Aloo fry)

క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్

హోటల్ స్టైల్ మసాలా దోశ రెసిపీ | Crispy Masala Dosa Recipe in Telugu