హోటల్ స్టైల్ మసాలా దోశ రెసిపీ | Crispy Masala Dosa Recipe in Telugu

 మసాలా దోశ రెసిపీ | Masala Dosa Recipe in Telugu

పరిచయం 

మసాలా దోశ దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అల్పాహారం. బయట హోటల్‌లో తినే రుచినే ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. కరకరలాడే దోశలో బంగాళాదుంప మసాలా నింపి వేడివేడిగా కొబ్బరి చట్నీ, సాంబార్‌తో వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు  మసాలా దోశ ఎలా చేయాలో చూద్దాం.





🔪 ⏰
Prep Time:
 6 - 8 గంటలు (నానబెట్టడం మరియు పులవడానికి కలిపి)
🕛
Cook Time:
 
30 నిమిషాలు (దోశలు వేయడానికి)
👨‍🍳
Servings:
 6-8
🔥
Calories:
112 kcal

కావలసిన పదార్థాలు

దోశపిండికి

  • 1 కప్పు మినప్పప్పు
  • 2 కప్పులు బియ్యం
  • నానబెట్టడానికి నీరు
  • తగినంత ఉప్పు

దోశకి కావాల్సిన పదార్ధాలు


కావాల్సిన పదార్ధాలు

మసాలా కూరకు

  • 3–4 బంగాళాదుంపలు
  • 2 ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
  • 2 పచ్చిమిర్చి
  • చిన్న అల్లం ముక్క
  • కరివేపాకు కొద్దిగా 
  • కొత్తిమీర ఒక రెమ్మ 
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • 1 టీ స్పూన్ ఆవాలు
  • 1 టీ స్పూన్ జీలకర్ర
  • 1 టీ స్పూన్ మినప్పప్పు
  • 1 టీ స్పూన్ శెనగపప్పు
  • ¼ టీ స్పూన్ పసుపు
  • తగినంత ఉప్పు

తయారీ విధానం

దోశ పిండి తయారీ

  1. మినప్పప్పు మరియు బియ్యాన్ని విడివిడిగా కడిగి నీరు పోసి కొన్ని గంటలు నానబెట్టాలి.
  2. బాగా నానిన తర్వాత నీరు వంపి మినపప్పు, బియ్యం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బిన పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  4. పిండిని కొంతసేపు పులియబెట్టాలి.

మసాలా తయారీ

  1. బంగాళాదుంపలను నీటిలో ఉడికించి తొక్క తీసి చేతితో కొద్దిగా మెత్తగా చేసుకోవాలి.
  2. అల్లం, పచ్చిమిర్చిని సన్నగా తరిగి మెత్తగా రుబ్బి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
  3. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక మినప్పప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
  4. తరువాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ , కరివేపాకు వేసి కలపాలి.
  5. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
  6. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత బంగాళాదుంప ముద్ద వేసి బాగా కలపాలి.
  7. 5 నిమిషాలు ఉడికించి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
బంగాళాదుంపలు ఉడికించుట, అల్లం పచ్చిమిర్చి నూరుట

బంగాళాదుంప మసాలా కూర తయారీ


బంగాళాదుంప మసాలాతో చేసిన మసాలా దోశ

మసాలా దోశ తయారీ

  1. దోశ పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి.
  2. ఒక గరిటె పిండిని పోసి పలుచగా దోశ లా పరచాలి.
  3. ఒక వైపు బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి.
  4. మధ్యలో తయారుచేసుకున్న బంగాళాదుంప మసాలాను పెట్టి సమంగా పరిచి దోశను మడవాలి.
  5. వేడివేడిగా కొబ్బరి చట్నీ,లేదా పల్లి చట్నీ,సాంబార్‌తో వడ్డించండి
దోశ preparation

Dosa preparation

Masala Dosa Recipe in Telugu

SouthIndian Masala Dosa Recipe in Telugu


చిట్కాలు 

  • పిండిని బాగా పులియబెడితే దోశ కరకరలాడుతుంది.
  • దోశ వేసే ముందు పెనం బాగా వేడిగా ఉండాలి.
  • ఉల్లిపాయలను బాగా వేయిస్తే మసాలా మరింత రుచిగా ఉంటుంది.
  • కొత్తిమీర చివర్లో వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది.
  • దోశ మరింత క్రిస్పీగా కావాలంటే కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి.

ముగింపు 

ఈ సులభమైన విధానంలో ఇంట్లోనే హోటల్ స్టైల్ మసాలా దోశ ను తయారు చేసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం టిఫిన్‌గా ఇది అందరికీ ఎంతో నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి.

Homemade మసాలా దోశ


FAQ

1. మసాలా దోశ పిండిని ఎంతసేపు నానబెట్టాలి?
A.సుమారు 6–8 గంటలు నానబెడితే మంచి పిండి వస్తుంది.
2. పిండిని పులియబెట్టడం అవసరమా?
A.అవును. పులిసిన పిండితో దోశ మరింత  కరకరలాడేలా వస్తుంది.
3. మసాలా కూరలో బఠానీ లేదా క్యారెట్ వేయవచ్చా?
A.అవును. మీ ఇష్టానికి అనుగుణంగా బఠానీ, క్యారెట్ కూడా కలపవచ్చు.
4. మసాలా దోశకు ఏ చట్నీ బాగా సరిపోతుంది?
A.కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ మరియు సాంబార్‌తో చాలా రుచిగా ఉంటుంది.
5. దోశ ఎందుకు కరకరలాడదు?
A.పిండి సరైనంత పులియకపోవడం లేదా పెనం సరైన వేడి లేకపోవడం ప్రధాన కారణాలు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆలూ ఫ్రై ( Aloo fry)

క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్

కట్ పొంగలి రెసిపీ | సులభంగా చేసే సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ | Telugu Recipe