క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్
క్షీరాన్నం (పరమాన్నం)
పరిచయం (Introduction):
హలో ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. ఈరోజు మన వంటింట్లో క్షీరాన్నం, లేదా పరమాన్నం, ఎలా తయారు చేయాలో చూద్దాం.తెలుగు సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన ప్రసాదం. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే ఈ తీపి వంటకం పండుగలు, పూజలు, శుభకార్యాలలో తప్పనిసరిగా కనిపి
| 📋 వివరాలు | ℹ️ సమాచారం |
|---|---|
| ⏱️ తయారీ సమయం | 10 నిమిషాలు |
| 🍲 వంట సమయం | 30 నిమిషాలు |
| ⌛ మొత్తం సమయం | 40 నిమిషాలు |
| 🍽️ సర్వింగ్స్ | 6–8 మంది |
| 🥣 వంటకం రకం | స్వీట్ / ప్రసాదం |
| 🌿 వంట విధానం | సాంప్రదాయ తెలుగు వంటకం |
| ⭐ కష్టతర స్థాయి | చాలా సులభం |
| 🔥 కేలరీలు (ఒక్క సర్వింగ్) | 290 kcal (సుమారుగా) |
కావాల్సిన పదార్థాలు (Ingredients):
- బియ్యం -1కప్పు
- పంచదార -1 కప్పు
- నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
- పాలు -10 కప్పులు
- జీడిపప్పు -10
- కిస్మిస్ – 10
తయారీ విధానం:
ఒక ఇత్తడి గిన్నె తీసుకుని అందులో పాలు పోసి వేడి చేయాలి. కొన్ని పాలను విడిగా ఉంచాలి. పాలు కాగి పొంగురాగానే బియ్యం కడిగి అందులో పోయాలి.
అన్నం బాగా మెత్తగా ఉడికేవరకు స్టవ్ సిమ్‌లో ఉంచాలి. అప్పుడప్పుడు కలుపుతూ మధ్య మధ్యలో విడిగా ఉంచిన పాలు పోస్తూ కలుపుతూ ఉండాలి.
అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొద్ది కొద్దిగా పంచదార పోస్తూ కలియబెడుతూ ఉండాలి. పంచదార పూర్తిగా పోయడం అయ్యాక అన్నం గిన్నెను స్టవ్ మీద నుంచి దించేయాలి.
మీకు ఇష్టం అయితే పంచదార బదులు బెల్లంతో క్షీరాన్నము తయారు చేసుకోవచ్చు. మీరు పంచదార వాడినా, బెల్లం వాడినా అన్నంలో అవి పూర్తిగా కరిగేక అప్పుడు అన్నం గిన్నెను స్టవ్ మీద నుంచి కిందకు దించాలి. అంత వరకు గిన్నె స్టవ్ మీదనే ఉండాలి. అయితే స్టవ్ ను సిమ్‌లో పెడితే అన్నం మాడిపోకుండా ఉంటుంది.
ఇక ఇప్పుడు ఏం చేయాలంటే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ , అన్నీ క్షీరాన్నములో కలపాలి.
మిగిలిన నేతిని కొద్దిగా వేడి చేసి కలిపితే క్షీరాన్నము రుచే వేరు.
క్షీరాన్నం ప్రత్యేకత
దేవాలయ ప్రసాదంగా విరివిగా ఉపయోగిస్తారు.
శ్రీకృష్ణాష్టమి, సంక్రాంతి, వరలక్ష్మీ వ్రతం వంటి పండుగల్లో ప్రత్యేకంగా తయారు చేస్తారు.
కొన్ని చిట్కాలు (Pro-Tips):
నెయ్యి:జీడిపప్పు కిస్మిస్మి వేయించక మిగిలిన నేతిని కొద్దిగా వేడి చేసి కలిపితే క్షీరాన్నము రుచే వేరు.
బియ్యం :క్షీరాన్నం వండేటప్పుడు బియ్యం నానబెట్టకండి
శక్తీ :పాలు, బియ్యం కలయిక వల్ల రుచికరంగా ఉండటమే కాకుండా శక్తిని కూడా అందిస్తుంది.
ముగింపు:
సంప్రదాయం, రుచి, భక్తి కలయికే క్షీరాన్నం. ఇంట్లో సులభంగా తయారుచేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆస్వాదించండి. 🍚
Q: పరమాన్నం కోసం బెల్లం బదులు చక్కెర వాడవచ్చా?
A: అవును, బెల్లం బదులు చక్కెర వాడవచ్చు.
Q: క్షీరాన్నం ఎంతసేపు నిల్వ ఉంటుంది?
A: ఫ్రిజ్‌లో 1–2 రోజులు నిల్వ ఉంటుంది.
Q: పరమాన్నం ప్రసాదంగా ఎందుకు చేస్తారు?
A: ఇది సంప్రదాయంగా శుభప్రదమైన నైవేద్యంగా భావిస్తారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి