కరకరలాడే రవ్వ దోస రెసిపీ | Crispy Instant Rava Dosa Recipe in Telugu
కరకరలాడే రవ్వ దోస | ఇన్‌స్టంట్ రవ్వ దోస రెసిపీ పరిచయం ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం టిఫిన్‌కు త్వరగా తయారయ్యే వంటల్లో రవ్వ దోస ఒకటి. బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, కొద్దిగా శనగపిండి, పంచదార కలిపి చేసిన ఈ దోస బయట కరకరలాడుతూ, లోపల తేలికగా ఉంటుంది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. Prep time ⏰ 10 Minutes Rest Time ⏰ 20 Minutes Cook Time 👩🍳 20 Minutes Total Time 50 Minutes Servings 4 మంది Cuisine South Indian కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ (సన్న రవ్వ) లేదా ఉప్మా రవ్వ – 1 కప్పు బియ్యప్పిండి – 1 కప్పు మైదా పిండి -1/2 కప్పు శనగపిండి (బేసన్) – 1 టేబుల్ స్పూన్ పంచదార – 1 టీ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం సన్నగా తరిగింది – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరిగింది – 2 కరివేపాకు సన్నగా తరిగింది – 1 రెమ్మ కొత్తిమీర తరిగింది – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత క్యారెట్- 1 నీరు – పలుచటి పిండికి సరిపడా నూనె – దోశ వేయించడానికి తయారీ విధానం ఒక పెద్ద గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి,శనగపిండి,మైదాపిండి పంచదార, ఉప్పు వేసి బాగా కల...