రుచికరమైన నువ్వులపొడి | Nuvvula Podi Recipe
నువ్వులపొడి | Nuvvula Podi Recipe ఇంట్లో చాలా సింపుల్‌గా తయారు చేసుకునే పొడుల్లో నువ్వులపొడి కూడా ఒకటి. నువ్వులు, ఎండు మిరపకాయలు, ఉప్పుతో తయారయ్యే ఈ పొడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడి అన్నంలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని ఈ నువ్వులపొడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. 😋 అంతేకాదు, ఆనపకాయ కూర, చిక్కుడుకాయ కూర, పొట్లకాయ కూర వంటి పోపు కూరలు వండినప్పుడు చివర్లో కొద్దిగా నువ్వులపొడి చల్లితే కూర రుచి మరింత పెరుగుతుంది. వేడి అన్నంలో నువ్వుల నూనెతో కలుపుకుని తినడానికి రుచికరమైన నువ్వులపొడి 🥣 కావలసిన పదార్థాలు నువ్వులు-1 కప్పు ఎండు మిరపకాయలు=1/2కప్పు ఉప్పు=తగినంత నువ్వులపొడి తయారీ విధానం ముందుగా ఒక పాన్‌ను స్టవ్‌పై పెట్టి వేడి చేయాలి. అందులో 1 కప్పు నువ్వులు వేసి, నువ్వులు కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. నువ్వులు బాగా వేగకుండా జాగ్రత్తగా చూసుకుని వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో ఎండు మిరపకాయలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఎండు మిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. నువ్వులు, ఎండు మిరపకాయలు పూర్తిగా చల్లారనివ్వా...