సాంప్రదాయ చింతపండు పులిహోర | టెంపుల్ స్టైల్ పులిహోర తయారీ విధానం

 చింతపండు పులిహోర

పరిచయం

చింతపండు పులిహోర తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధమైన వంటకం. పండుగలు, పూజలు, ప్రయాణాలు, లంచ్ బాక్స్‌లకు ఇది అద్భుతమైన ఎంపిక. సరైన  తాలింపు కలిస్తే ఈ పులిహోర రుచి మరింత పెరుగుతుంది.



📋 వివరాలు ℹ️ సమాచారం
⏱️ తయారీ సమయం 15 నిమిషాలు
🍳 వంట సమయం 15 నిమిషాలు
⌛ మొత్తం సమయం 30 నిమిషాలు
🍽️ ఎన్ని మందికి 4 మంది
🥣 వంటకం రకం రైస్ రెసిపీ
🌿 వంట విధానం pure veg  స్టైల్
⭐ కష్టతర స్థాయి చాలా సులభం
🔥 కేలరీలు (ఒక్క సర్వింగ్) 320 kcal

కావాల్సిన పదార్థాలు
  • 🍚 వండిన అన్నం – 3 కప్పులు
  • 🌿 చింతపండు – నిమ్మకాయ పరిమాణం (50 గ్రాములు)
  • 🥜 వేరుశెనగలు – ½ కప్పు
  • 🟡 పసుపు – ½ టీస్పూన్
  • 🧂 ఉప్పు – 1½ టీస్పూన్లు (రుచికి సరిపడా)
  • 🍯 బెల్లం – 1 టేబుల్ స్పూన్
  • 🌶️ ఎండుమిర్చి – 4
  • 🌶️ పచ్చిమిర్చి – 4 (చీల్చినవి)
  • 🫘 శనగపప్పు – 1 టేబుల్ స్పూన్న
  • 🫘 మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్
  • 🌱 ఆవాలు – 1 టీస్పూన్
  • 🌿 కరివేపాకు – 2 రెమ్మలు
  • 🌰 నువ్వులు (వేయించి పొడి చేసినవి) – 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం)
  • 🧈 నూనె – 4 టేబుల్ స్పూన్లు
  • 🌿 ఇంగువ – చిటికెడు 

తయారీ విధానం

ముందుగా బియ్యం కడిగి   కుక్కర్ లో   అన్నం వండుకోవాలి. దీనిని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం పొడిపొడిగా ఉండటం ముఖ్యం.

స్టవ్ మీద బాణలి (మూకుడు) పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు,  కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు ఇందులో నిలువుగా తరిగిన పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేసి వేయించాలి. చివరగా చిటికెడు ఇంగువ మరియు పసుపు కూడా వేసి కలపాలి.
చింతపండును నానబెట్టి చిక్కటి రసం తీసుకోండి.
తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఈ పోపులో పోసి, తగినంత ఉప్పు  పసుపు, బెల్లం వేసి, చింతపండు గుజ్జు దగ్గరపడే వరకు (నూనె పైకి తేలే వరకు) ఉడికించుకోవాలి.
చివరగా ఉడికించిన చింతపండు మిశ్రమాన్ని, నువ్వులపోడిని చల్లారబెట్టిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇష్టం లేనివాళ్లు నువ్వుల పొడిని వదిలెయ్యచ్చు 
20 నిమిషాలు మూతపెట్టి ఉంచితే రుచి బాగా వస్తుంది..

అంతే! ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర సిద్ధం. దీనిని వేడివేడిగా లేదా చల్లారాక తిన్నా చాలా బాగుంటుంది.

 చిట్కాలు 

  1. చింతపండు పేస్ట్ ముందుగానే తయారు చేసుకుంటే సమయం ఆదా అవుతుంది.
  2. కొద్దిగా బెల్లం వేస్తే రుచి బ్యాలెన్స్ అవుతుంది.
  3. నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
  4. అన్నం చల్లారిన తర్వాత నువ్వులపోడి కలపాలి. లేదంటే పులిహోర చేదు వస్తుంది 

ముగింపు

చింతపండు పులిహోర తెలుగు వారి సంప్రదాయ వంటల్లో ఒక ప్రత్యేకమైన వంటకం. పండుగలు, పూజలు, ప్రయాణాలు లేదా లంచ్ బాక్స్ కోసం ఇది అద్భుతమైన ఎంపిక. పై విధంగా తయారు చేస్తే టిఫిన్ సెంటర్ లేదా దేవాలయ ప్రసాదం తరహా రుచి వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆలూ ఫ్రై ( Aloo fry)

క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్

కట్ పొంగలి రెసిపీ | సులభంగా చేసే సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ | Telugu Recipe