రాజ్మా మసాలా కర్రీ | Rajma Masala Curry Recipe in Telugu | Easy Rajma Curry
రాజ్మా మసాలా కర్రీ | Rajma Masala Curry
Introduction
రాజ్మాతో చేసే ఈ మసాలా కర్రీ రుచిగా, కమ్మగా ఉండటమే కాకుండా అన్నం, చపాతీ, రోటీతో కూడా చాలా బాగుంటుంది. ముందుగా రాజ్మాను నానబెట్టి ఉడికించి, ఉల్లిపాయ–టమాటా మసాలాతో కలిపి తయారు చేస్తే మంచి రుచికరమైన కర్రీ సిద్ధమవుతుంది.
| పదార్థం | పరిమాణం |
|---|---|
| రాజ్మా | 1 కప్పు |
| ఉల్లిపాయ | 1 పెద్దది |
| టమాటాలు | 2 పెద్దవి |
| అల్లం వెల్లుల్లి పేస్ట్ | 1 tsp |
| పచ్చిమిర్చి | 1–2 |
| జీలకర్ర | ½ tsp |
| పసుపు | ¼ tsp |
| కారం | 1 tsp |
| ధనియాల పొడి | 1½ tsp |
| జీలకర్ర పొడి | ½ tsp |
| గరం మసాలా | ½ tsp |
| నూనె | 2 tbsp |
| ఉప్పు | తగినంత |
| కొత్తిమీర | కొద్దిగా |
| నీరు | అవసరమైనంత |
⏰ Preparation & Cooking Time
| వివరం | సమయం |
|---|---|
| రాజ్మా నానబెట్టే సమయం | 8 గంటలు / రాత్రంతా |
| Preparation Time | 15 నిమిషాలు |
| Cooking Time | 30–35 నిమిషాలు |
| మొత్తం సమయం (నానబెట్టడం మినహా) | 45–50 నిమిషాలు |
| Servings | 4 మందికి |
👩🍳 Rajma Soaking
రాజ్మాను బాగా కడగాలి.
ఒక గిన్నెలో రాజ్మా వేసి ఎక్కువ నీరు పోయాలి.
కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి.
నానిన నీటిని పారబెట్టి రాజ్మాను మరోసారి కడగాలి.
👩🍳 Rajma Cooking
ప్రెజర్ కుక్కర్‌లో నానబెట్టిన రాజ్మా వేయాలి.
అవసరమైనంత నీరు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి.
రాజ్మా మెత్తగా ఉడికే వరకు ప్రెజర్ కుక్ చేయాలి. అంటే 3=4 whistles వచ్చేవరకు ఉంచాలి
ఉడికిన రాజ్మాను పక్కన పెట్టాలి.
రాజ్మా ఉడికిన నీటిని పారబోయకుండా కొంత పక్కన ఉంచితే gravyకి ఉపయోగపడుతుంది.
ముఖ్యమైన విషయం: రాజ్మా పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాతే ఉపయోగించాలి.
Tomato Paste తయారు చేయడం
టమాటాలను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేయాలి.
అవసరమైతే 1–2 tbsp నీరు వేసి మెత్తని pasteగా చేసుకోవాలి.
ఈ tomato pasteను పక్కన పెట్టాలి
Masala తయారు చేయడం
కడాయిలో 2 tbsp నూనె వేడి చేయాలి.
జీలకర్ర వేయాలి.
తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మెత్తగా, లైట్‌గా golden colour వచ్చే వరకు వేయించాలి.
వేయించుకున్న ఉల్లిపాయలును మిక్సీ jar లో వేసి onion paste చేసి ఉంచుకువాలి.
Rajma curry preparation
ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న tomato pasteను నేరుగా కడాయిలో వేయాలి.
బాగా కలిపి 5–7 నిమిషాలు ఉడికించాలి.
పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
మసాలా చిక్కగా మారి నూనె కొద్దిగా పైకి కనిపించే వరకు తక్కువ మంటపై ఉడికించాలి.
Rajma కలపడం
ఉడికించిన రాజ్మాను gravyలో వేయాలి.
అవసరమైనంత రాజ్మా ఉడికిన నీరు లేదా సాధారణ నీరు పోయాలి.
ఉప్పు సరిచూసుకోవాలి.
మూత పెట్టి తక్కువ మంటపై 10–15 నిమిషాలు ఉడికించాలి.
చివరగా గరం మసాలా వేసి కలపాలి.
కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
😋 Serving
Rajma Masala Curryని వేడి అన్నం, జీరా రైస్, చపాతీ, రోటీ లేదా పుల్కాతో సర్వ్ చేయవచ్చు.
💡 Tips
రాజ్మాను తప్పనిసరిగా బాగా నానబెట్టడం మంచిది.
రాజ్మా పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాతే కర్రీలో ఉపయోగించాలి.
మసాలాను బాగా వేయిస్తే కర్రీ రుచి మరింత బాగుంటుంది.
కర్రీ చాలా చిక్కగా ఉంటే కొద్దిగా వేడి నీరు కలపవచ్చు.
మరింత creamy consistency కావాలంటే కొన్ని రాజ్మా గింజలను గరిటెతో కొద్దిగా మెదపవచ్చు.
🌱 Conclusion
ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోగలిగే రుచికరమైన Rajma Masala Curry ఇది. చపాతీ లేదా వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి