రవ్వ కేసరి రెసిపీ | ఇంట్లో సులభంగా చేసే రుచికరమైన Ravva Kesari

 రవ్వ కేసరి రెసిపీ | Ravva Kesari

పరిచయం 

రవ్వ కేసరి అనేది అందరికీ ఇష్టమైన సులభమైన స్వీట్. సాధారణంగా కొంతమంది ఫుడ్ కలర్ వేసి తయారు చేస్తారు. కానీ ఎలాంటి రంగులు ఉపయోగించకుండా కూడా నెయ్యి, పాలు, జీడిపప్పు, కిస్మిస్‌తో సహజమైన రుచితో రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు. ఇది పండుగలు, ప్రత్యేక సందర్భాలు లేదా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు సులభంగా చేసుకునే వంటకం.
Home made ravva kesari

వంటకం 🧑‍🍳 రవ్వ కేసరి
వంట రకం 🥣 స్వీట్
తయారీ సమయం⏱️ 5 నిమిషాలు
వండే సమయం 🍳 15 నిమిషాలు
మొత్తం సమయం ⌛ 20 నిమిషాలు
సర్వింగ్స్ 🍽️ 4 మంది
క్యాలరీలు (ఒక్క సర్వింగ్‌కు) 🔥 సుమారు 320 kcal
కీవర్డ్🏷️ రవ్వ కేసరి, Ravva Kesari Recipe Telugu, Suji Kesari, Sweet Recipe

కావలసిన పదార్థాలు (Ingredients):

  • బొంబాయి రవ్వ  - 1 కప్పు
  • పాలు - 1 కప్పు
  • నీరు -2 కప్పులు
  • చక్కెర-1 కప్పు
  • నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి = 1/2 టీ స్పూన్
  • జీడిపప్పు -10
  • కిస్మిస్- 2 టేబుల్ స్పూన్లు
  • కుంకుమ పువ్వు - 5 రేకులు (ఐచ్ఛికం)

తయారీ విధానం (Preparation):

  1. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి రవ్వను తక్కువ మంటపై మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
  3. ఒక పాత్రలో పాలు, నీరు కలిపి మరిగించాలి.
  4. పాలు మరిగించే ముందు కుంకుమపువ్వు రేకులను ఒక చిన్న గ్లాస్ పాలల్లో 5 నిమిషాలు నానబెట్టి ఉపయోగించుకోవచ్చు
  5. పాలు నీళ్లు బాగా మరిగిన తర్వాత వేయించిన రవ్వను నెమ్మదిగా వేస్తూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ రవ్వ ఉడికించాలి.
  6. రవ్వ మెత్తగా అయిన తర్వాత చక్కెర వేసి బాగా కలపాలి.
  7. మిగిలిన నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి.
ఏలకుల పొడి వేయడం
పాలల్లో కుంకుమ పువ్వు కలిపి నాన బెట్టడం


  1. యాలకుల పొడి వేసిన తర్వాత, కుంకుమపువ్వు నానబెట్టిన పాలను (ఐచ్ఛికం) పోసి బాగా కలపాలి.ఒక నిమిషం ఉడికిన తర్వాత వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  2. కుంకుమపువ్వు లేకపోయినా రవ్వ కేసరి బాగా వస్తుంది.
  3.  చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి.
  4. నెయ్యి విడిపోయి మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
జీడిపప్పు, కిస్మిస్ వేయడం
జీడిపప్పు, కిస్మిస్‌తో అలంకరించిన ఇంట్లో తయారు చేసిన రవ్వ కేసరి
చివరిగా రవ్వకేసరిని bowl lo తీయడం

FAQ

1. రవ్వ కేసరి చేయడానికి ఏ రవ్వ ఉపయోగించాలి?
A.రవ్వ కేసరి కోసం బొంబాయి రవ్వ (సూజీ/ఉప్మా రవ్వ) ఉపయోగిస్తే మెత్తగా, రుచిగా వస్తుంది.
2. రవ్వ కేసరిలో ఫుడ్ కలర్ తప్పనిసరిగా వేయాలా?
A.లేదు. ఫుడ్ కలర్ లేకుండానే రవ్వ కేసరి చాలా రుచిగా తయారవుతుంది. కావాలంటే కుంకుమపువ్వు ఉపయోగించి సహజమైన రంగు పొందవచ్చు.
3. రవ్వ కేసరి మెత్తగా రావాలంటే ఏమి చేయాలి?
A.రవ్వను ముందుగా తక్కువ మంటపై బాగా వేయించి, మరిగే పాలు-నీటి మిశ్రమంలో నెమ్మదిగా వేస్తూ కలపాలి.
4. రవ్వ కేసరిలో పాలు ఎందుకు వేస్తారు?
A.పాలు వేయడం వల్ల రవ్వ కేసరి మరింత మెత్తగా, క్రీమీగా మరియు రుచిగా ఉంటుంది.
5. రవ్వ కేసరిని ఎంత రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు?
A.గది ఉష్ణోగ్రతలో ఒక రోజు వరకు, ఫ్రిజ్‌లో 2 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. తినే ముందు కొద్దిగా వేడి చేస్తే తాజాగా ఉంటుంది.
రవ్వ కేసరి రెసిపీ | రంగులు లేకుండా చేసే రుచికరమైన స్వీట్ (

ముగింపు 

రంగులు లేకుండా తయారు చేసే ఈ రవ్వ కేసరి ఆరోగ్యకరంగా, రుచిగా ఉంటుంది. పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వల్ల మంచి రుచి వస్తుంది. తక్కువ సమయంలో తయారయ్యే ఈ స్వీట్‌ను ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆలూ ఫ్రై ( Aloo fry)

క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్

హోటల్ స్టైల్ మసాలా దోశ రెసిపీ | Crispy Masala Dosa Recipe in Telugu