దద్దోజనం రెసిపీ | సాంప్రదాయ తెలుగు పెరుగు అన్నం | Daddojanam Recipe in Telugu

 దద్దోజనం 

పరిచయం

దద్దోజనం లేదా పెరుగు అన్నం తెలుగు ఇళ్లలో ఎంతో ఇష్టంగా చేసే సాంప్రదాయ వంటకం. ముఖ్యంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే ఈ వంటకం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సాధారణ పదార్థాలతో చాలా తక్కువ సమయంలో తయారయ్యే ఈ దద్దోజనం భోజనం చివర్లో తింటే మరింత రుచిగా ఉంటుంది.
సాంప్రదాయ తెలుగు దద్దోజనం | పెరుగు అన్నం రెసిపీ


⏰
Prep Time:
 20 hours
⏲️
Cook Time:
30 mins
👨‍🍳
Servings:
6-8
🔥
Calories:
112 kcal

కావలసిన పదార్థాలు

  • ఉడికించిన అన్నం – 2 కప్పులు
  • పెరుగు – 1½ కప్పులు
  • పాలు – ¼ కప్పు (ఐచ్చికం)
  • ఉప్పు – తగినంత
  • నూనె – 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు – ½ టీస్పూన్
  • మినప్పప్పు – 1 టీస్పూన్
  • శనగపప్పు – 1 టీస్పూన్
  • జీలకర్ర – ½ టీస్పూన్
  • ఎండు మిర్చి – 2
  • పచ్చిమిర్చి – 2 (తరిగినవి)
  • అల్లం తురుము – 1 టీస్పూన్
  • కరివేపాకు – ఒక రెమ్మ
  • ఇంగువ - చిటికెడు 
  • కొత్తిమీర – కొద్దిగా
  • దానిమ్మ గింజలు 

దద్దోజనం తయారీకి కావలసిన పదార్థాలు

దద్దోజనం తయారీకి కావలసిన పదార్థాలు

తయారీ విధానం

ముందుగా ఉడికించిన అన్నాన్ని పెద్ద పళ్లెం లో పోసి పూర్తిగా చల్లారనివ్వండి.
దద్దోజనం కోసం ఉడికించిన అన్నం

అన్నంలో ఉప్పు, పాలు (ఇష్టం లేకపోతే పాలు skip చెయ్యొచ్చు) పెరుగు వేసి బాగా కలపండి.

దద్దోజనం కోసం అన్నంలో పాలు కలుపుతున్న విధానం
దద్దోజనం కోసం తయారు చేసుకున్న పద్దర్ధాలు


దద్దోజనం తాలింపు తయారీ


అన్నం లో తాలింపు వేయడం

చల్లారిన అన్నంలో పెరుగు వేయడం

పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించండి.
తర్వాత ఎండు మిర్చి, వేసుకోవాలి.పచ్చిమిర్చి, అల్లం ను మిక్సీ లో వేసి మెత్తగా చేసుకోవాలి  ఎందుకు అల్లం పచ్చిమిర్చి మెత్తగా చేసుకోవాలంటే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలానే వేస్తే పిల్లల నోటికి కారం తగిలి తినరు. అందుకే ఇలా వేస్తే ఈజీగా తినేస్తారు. ఇంకా కరివేపాకు ఇంగువ కుడా వేసి తాలింపు సిద్ధం చేయండి.
ఈ తాలింపును పెరుగు అన్నంలో వేసి బాగా కలపండి.
చివరగా కొత్తిమీర, ఇష్టం ఉంటే దానిమ్మ గింజలతో అలంకరించి వడ్డించండి.

చిట్కాలు

  1. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగు కలపండి.
  2. వేసవిలో కొద్దిగా పాలు కలిపితే పెరుగు అన్నం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
  3. మరింత రుచికి తురిమిన క్యారెట్ లేదా దోసకాయ కూడా కలపవచ్చు.
  4. వడ్డించే ముందు దానిమ్మ గింజలు వేస్తే రుచి, అందం రెండూ పెరుగుతాయి.
  5. వడ్డించే సూచనలు
  6. దద్దోజనాన్ని మామిడికాయ ఊరగాయ, ఆవకాయ, మజ్జిగ మిరపకాయ లేదా ఆలూ ఫ్రైతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.

ఇంట్లో చేసిన రుచికరమైన దద్దోజనం

ముగింపు

సులభంగా, తక్కువ సమయంలో తయారయ్యే దద్దోజనం ప్రతి ఇంట్లో చేసే సాంప్రదాయ వంటకం. ఆరోగ్యకరమైన ఈ పెరుగు అన్నాన్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. దద్దోజనానికి ఏ బియ్యం మంచిది?
సాధారణంగా సోనా మసూరి బియ్యంతో చాలా రుచిగా ఉంటుంది.
2. పెరుగు పుల్లగా ఉంటే ఏమి చేయాలి?
కొద్దిగా పాలు కలిపితే రుచి సమతుల్యంగా ఉంటుంది.
3. దద్దోజనాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చా?
అవును, ఒక రోజు వరకు నిల్వ చేయవచ్చు.
4. పిల్లలకు ఈ రెసిపీ సరిపోతుందా?
అవును. తక్కువ కారం వేసి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
5. దద్దోజనంలో పండ్లు వేయవచ్చా?
అవును. దానిమ్మ గింజలు, ద్రాక్ష లేదా తురిమిన క్యారెట్ కలిపితే రుచి మరింత బాగుంటుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆలూ ఫ్రై ( Aloo fry)

క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్

హోటల్ స్టైల్ మసాలా దోశ రెసిపీ | Crispy Masala Dosa Recipe in Telugu