Crispy Bendi Kurkure Recipe in Telugu | బెండి కుర్కురే స్నాక్ | Crispy Okra Fry

బెండి కుర్కురే స్నాక్ | Crispy Okra Fry

పరిచయం 

సాయంత్రం టీతో తినడానికి కరకరలాడే స్నాక్ కావాలంటే ఈ క్రిస్పీ బెండి కుర్కురే చాలా బాగుంటుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ రెసిపీని చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.




📋 వివరాలు ℹ️ సమాచారం
⏱️ తయారీ సమయం 10 నిమిషాలు
🍳 వంట సమయం 15 నిమిషాలు
⌛ మొత్తం సమయం 25 నిమిషాలు
🍽️ ఎన్ని మందికి 3 మంది
🥘 వంటకం రకం సైడ్ డిష్ / ఫ్రై
🌿 వంట విధానం Pure veg style స్టైల్
⭐ కష్టతర స్థాయి చాలా సులభం
🔥 కేలరీలు (ఒక్క సర్వింగ్) 150 kcal

కావాల్సిన పదార్ధాలు 

  • బెండకాయలు – 250 గ్రాములు
  • శనగపిండి – ½ కప్పు
  • బియ్యం పిండి -1/4 కప్పు 
  • కార్న్ ఫ్లోర్ – ¼ కప్పు 
  • కారం – 1 టీస్పూన్
  • పసుపు – ¼ టీస్పూన్
  • ధనియాల పొడి – ½ టీస్పూన్
  • జీలకర్ర పొడి – ½ టీస్పూన్
  • గరం మసాలా – ¼ టీస్పూన్ (ఐచ్చికం)
  • ఉప్పు – తగినంత
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్ (ఐచ్చికం)
  • నూనె – డీప్ ఫ్రై చేయడానికి

తయారు చేయు విధానం 

  1. బెండకాయలను కడిగి పూర్తిగా ఆరబెట్టి పొడవుగా చీల్చండి.
  2. ముందుగా శనగపిండి, బియ్యం పిండి,కార్న్ ఫ్లోర్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బెండకాయలకు బాగా పట్టేలా కలపండి.
  3. అవసరమైతే కొద్దిగా నీరు చల్లి మసాలా బాగా కోటింగ్ అయ్యేలా చేయండి.
  4. మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి.
  5. వేడి వేడిగా సర్వ్ చేయండి.

చిట్కాలు 

  1. బెండకాయలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టాలి.
  2. కోటింగ్ బాగా పట్టేలా అవసరమైతే మాత్రమే కొద్దిగా నీరు చల్లండి.
  3. నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే బెండకాయలను వేయాలి.
  4. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్దికొద్దిగా వేయిస్తే కుర్కురే లా వస్తాయి.
  5. మీడియం మంటపై వేయిస్తే లోపల బాగా ఉడికి బయట కరకరలాడుతుంది.
  6. వేయించిన తర్వాత టిష్యూ పేపర్‌పై తీస్తే అదనపు నూనె తొలగిపోతుంది.

FAQ 

1. బెండి కుర్కురే ఎందుకు కరకరలాడదు?
A.బెండకాయల్లో తేమ ఎక్కువగా ఉంటే లేదా నూనె తగినంత వేడిగా లేకపోతే కరకరగా రాదు.
2. కార్న్ ఫ్లోర్ తప్పనిసరిగా వేయాలా?
A.అవును. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల బెండి మరింత క్రిస్పీగా ఉంటుంది.
3. ఎంతసేపు తాజాగా ఉంటుంది?
A.వేడిగా ఉన్నప్పుడే రుచి బాగా ఉంటుంది. గాలి చొరబడని డబ్బాలో ఉంచితే కొన్ని గంటల పాటు కరకరగా ఉంటుంది.

ముగింపు 

క్రిస్పీ బెండి కుర్కురే చాలా సులభంగా, తక్కువ పదార్థాలతో తయారయ్యే రుచికరమైన స్నాక్. సాయంత్రం టీతో లేదా పిల్లలకు స్నాక్‌గా ఇది అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తయారుచేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆలూ ఫ్రై ( Aloo fry)

క్షీరాన్నం (పరమాన్నం) రెసిపీ | పండుగ స్పెషల్ తెలుగు స్వీట్

కట్ పొంగలి రెసిపీ | సులభంగా చేసే సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ | Telugu Recipe