రవ్వ లడ్డు రెసిపీ | సులభంగా చేసే రవ్వ లడ్డు | Telugu Sweet Recipe
రవ్వ లడ్డు
పరిచయం:
హలో ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లో సులభంగా తయారు చేసే సంప్రదాయ స్వీట్లలో రవ్వలడ్డూ ఒకటి. రవ్వ, కొబ్బరి, నెయ్యి సువాసనలు కలిసిన ఈ లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారయ్యే ఈ స్వీట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా రుచికరమైన రవ్వలడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం
| ⏰ Prep Time: 10 mins |
⏲️ Cook Time: 30 mins |
| 👨🍳 Servings: 6-8 |
🔥 Calories: 112 kcal |
కావలసిన పదార్థాలు (Ingredients):
- బొంబాయి రవ్వ – 1 కప్పు
- కొబ్బరి తురుము – 1 కప్పు
- పంచదార – ¾ కప్పు
- నెయ్యి – ¼ కప్పు
- జీడిపప్పు – 10-12
- కిస్మిస్ – 10-15
- యాలకుల పొడి – ½ టీ స్పూన్
- పాలు – 2-3 టేబుల్ స్పూన్లు (అవసరమైతే)
తయారీ విధానం:
- పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌ను వేయించి పక్కన పెట్టండి.
- అదే పాన్‌లో రవ్వను సన్నని మంటపై సువాసన వచ్చే వరకు వేయించండి.
- తర్వాత కొబ్బరి తురుము వేసి 2-3 నిమిషాలు కలుపుతూ వేయించండి.
- మిశ్రమం చల్లారిన తర్వాత పంచదార, యాలకుల పొడి కలపండి.
- వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలపండి.
- నెయ్యి వేసి కలిపి, అవసరమైతే కొద్దికొద్దిగా పాలు చల్లి లడ్డూలుగా చుట్టండి.
చిట్కాలు:
- ఎండు కొబ్బరి వాడితే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
- తాజా కొబ్బరి వాడితే ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
- పంచదారకు బదులుగా బెల్లం పొడి కూడా ఉపయోగించవచ్చు.
- కొబ్బరి తురమడం కష్టం అనుకుంటే కొబ్బరి చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ లో వేయచ్చు
తరచుగా అడిగే ప్రశ్నలు
Q.రవ్వలడ్డూ గట్టిగా రాకపోతే ఏమి చేయాలి?
A.కొద్దిగా వేడి నెయ్యి లేదా పాలు కలిపి మళ్లీ లడ్డూలుగా చుట్టండి.
Q. రవ్వను ఎంతసేపు వేయించాలి?
A. సువాసన వచ్చే వరకు, లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
Q. కొబ్బరి లేకుండా రవ్వలడ్డూ చేయవచ్చా?
A. అవును, కొబ్బరి లేకుండా కూడా రుచికరమైన రవ్వలడ్డూ తయారు చేయవచ్చు.
Q రవ్వలడ్డూలు ఎంతకాలం నిల్వ ఉంటాయి?
A. పాలు లేకుండా చేస్తే 7–10 రోజులు, పాలు కలిపితే 2–3 రోజులు తాజాగా ఉంటాయి.
ముగింపు
కొబ్బరి సువాసనతో, రవ్వ రుచితో తయారయ్యే ఈ కొబ్బరి రవ్వలడ్డూలు పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అద్భుతమైన స్వీట్. ఇంట్లో సులభంగా తయారు చేసి కుటుంబంతో ఆస్వాదించండి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి